Vishnu Vardhan Reddy: ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌ ‌గారు ఆ 'యాప్'పై వివాదానికి తెరదించాలి: విష్ణువ‌ర్ధ‌న్ రెడ్డి

clear doubts on app asks vishnu vardhan reddy

  • 3,249 గ్రామాల్లో ఫిబ్రవరి 9వ తేదీన పోలింగ్‌
  • పంచాయతీ ఎన్నికల యాప్‌పై సందేహాలు
  • రాజకీయ పార్టీ తయారు చేసిన యాప్ అని ఆరోప‌ణ‌లు

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లు జ‌రుగుతోన్న నేప‌థ్యంలో నెల‌కొన్న ప‌రిస్థితుల‌పై బీజేపీ నేత‌ విష్ణువ‌ర్ధ‌న్ రెడ్డి అభ్యంత‌రాలు వ్య‌క్తం చేశారు. 'పంచాయతీ ఎన్నికల యాప్‌ గురించి ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌ ‌గారు వివాదానికి తెరదించాలి. ఈ యాప్ విషయంలో రహస్యంగా ఉంచాల్సిన అవసరం ఏంటి? ఎన్నికల సెల్‌  పర్యవేక్షణలో ఉందా? తయారైందా లేదా అనే విషయం ప్రకటిస్తే ఇంకా మంచిది. ఒకవేళ‌ ఉంటే ఈ’యాప్‌’కు రికార్డింగ్‌ మెసేజ్‌లు, ఫొటోలు, పిర్యాదులు పంపవచ్చా?' అని ప్ర‌శ్నించారు.
 
'కేంద్ర ఎన్నికల సంఘంలా ఈ యాప్‌ ద్వారా అందే ఫిర్యాదులను మీరు పరిగణిస్తారా? సహజంగా ఇలాంటి టెక్నాలజీ వ్యవస్థల్ని కేంద్ర ప్రభుత్వ అధీనంలోని నేషనల్‌ ఇన్ఫర్మాటిక్స్‌ సెంటర్‌ గానీ, రాష్ట్ర ప్రభుత్వ ఐటీ విభాగం గానీ నిర్వహిస్తాయి. ఈ ఎన్నికల కోసం ప్రత్యేక యాప్‌ను ఎవరు తయారు చేశారు?' అని ఆయ‌న ప్ర‌శ్నించారు.

'3,249 గ్రామాల్లో ఫిబ్రవరి 9వ తేదీన పోలింగ్‌ కూడా జరగబోతుంది. కొందరు దీనిమీద ఒక రాజకీయ పార్టీ తయారు చేసిన యాప్ అని ఇప్పటికే సామూజిక మాధ్యమాలలో ప్రచారం చేస్తున్నారు. వాస్తవం ఏంటో బహిరంగంగా ప్రజలకు వెంటనే తెలియజేయాల్సిన బాధ్య‌త రాష్ట్ర ఎన్నికల కమీషన్ మీద ఉంది' అని విష్ణువ‌ర్ధ‌న్ రెడ్డి చెప్పారు.

  • Loading...

More Telugu News