Nimmagadda Ramesh: నిమ్మగడ్డ రమేశ్ పై సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇచ్చిన బొత్స, పెద్దిరెడ్డి
- పరిధిని మించి ఎస్ఈసీ వ్యవహరిస్తున్నారని నోటీసులో పేర్కొన్న మంత్రులు
- ప్రివిలేజ్ కమిటీకి కూడా ఫిర్యాదు చేసే యోచనలో ప్రభుత్వం
- కోర్టును ఆశ్రయించే దిశగా సమాలోచనలు
ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్, ఏపీ ప్రభుత్వానికి మధ్య వివాదం రోజురోజుకు పెరుగుతోంది. తాజాగా నిమ్మగడ్డపై రాష్ట్ర మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇచ్చారు. శాసనసభ స్పీకర్ తమ్మినేని కార్యాలయంలో ఈ నోటీసులు ఇచ్చారు. పరిధిని మించి ఎస్ఈసీ వ్యవహరిస్తున్నారంటూ తమ నోటీసుల్లో వారు పేర్కొన్నారు.
నిమ్మగడ్డపై రాష్ట్ర గవర్నర్ హరిచందన్ కు కూడా ఫిర్యాదు చేసే యోచనలో మంత్రులు ఉన్నారు. దీనికితోడు, ప్రవిలేజ్ కమిటీకి కూడా ఆయనపై ఫిర్యాదు చేసే అంశంపై ఆలోచన చేస్తున్నారు. ఏకగ్రీవాల గురించి ప్రభుత్వం ఇచ్చిన ప్రకటనలను తప్పుపట్టిన ఎస్ఈసీ... టీడీపీ విడుదల చేసిన మేనిఫెస్టోపై మాట్లాడకపోవడం దారుణమని వైసీపీ నేతలు మండిపడుతున్నారు. ఎసీఈసీ పరిధికి సంబంధించి కోర్టును ఆశ్రయించాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు సమాచారం.