Nirmala Sitharaman: ముందెన్నడూ చూడని పరిస్థితుల మధ్య ప్రవేశపెడుతున్న బడ్జెట్ ఇది: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల
- ప్రసంగాన్ని ప్రారంభించిన నిర్మల
- కరోనాతో ఆర్థిక వ్యవస్థ కుదేలు
- నష్టపోయిన రంగాలకు చేయూత
2021-2022 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ ప్రతిపాదనలను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్ సభ ముందుంచారు. విపక్ష సభ్యుల నినాదాల మధ్య నిర్మల తన ప్రసంగాన్ని ప్రారంభించారు.
"గతంలో ఎన్నడూ చూడని పరిస్థితుల మధ్య నేను బడ్జెట్ ను ప్రవేశపెడుతున్నాను. కరోనా మహమ్మారి ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదేలు చేసింది. ఇటువంటి పరిస్థితుల్లో ఆత్మ నిర్భర భారత్ లో భాగంగా తయారు చేసిన మేడిన్ ఇండియా ట్యాబ్ లో ఈ బడ్జెట్ ను తీసుకుని వచ్చాను. నష్టపోయిన రంగాలకు చేయూత ఇచ్చేందుకు మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం ఇప్పటికే ఎన్నో చర్యలు తీసుకుంది. వాటికి కొనసాగింపుగా ఈ ప్రతిపాదనలు ఉంటాయి" అంటూ వరుసగా మూడవ సారి నిర్మల బడ్జెట్ ను చదవడం ప్రారంభించారు.