England: చెన్నై టెస్టులో నత్త నడకన సాగుతున్న ఇంగ్లండ్ బ్యాటింగ్

England bats very slowly in Chennai test

  • చెన్నైలో భారత్, ఇంగ్లండ్ మధ్య తొలి టెస్టు
  • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ 
  • 37 ఓవర్లలో 81/2
  • చెరో వికెట్ తీసిన అశ్విన్, బుమ్రా

చెన్నైలో టీమిండియా, ఇంగ్లండ్ జట్ల మధ్య తొలి టెస్టు ఇవాళ ప్రారంభమైంది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే ఇక్కడి చెపాక్ స్టేడియం పిచ్ మందకొడిగా ఉందని భావిస్తే, ఇంగ్లండ్ ఆటగాళ్లు మరీ మందకొడిగా ఆడుతున్నారు. తొలి రోజు ఆటలో రెండో సెషన్ సమయానికి 37 ఓవర్లు ఆడిన ఇంగ్లీష్ జట్టు 2 వికెట్లకు 81 పరుగులు చేయగలిగింది. ప్రస్తుతం క్రీజులో ఓపెనర్ డామ్ సిబ్లీ (122 బంతుల్లో 31 బ్యాటింగ్), కెప్టెన్ జో రూట్ (41 బంతుల్లో 11 బ్యాటింగ్) ఉన్నారు.

అంతకుముందు ఓపెనర్ రోరీ బర్న్స్ (60 బంతుల్లో 33) అశ్విన్ బౌలింగ్ లో వికెట్ కీపర్ రిషబ్ పంత్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత వచ్చిన డేనియల్ లారెన్స్ కేవలం 5 బంతులాడి సున్నా పరుగుల వద్ద అవుటయ్యాడు. ఈ వికెట్ బుమ్రాకు దక్కింది. ఈ పిచ్ నుంచి బౌలర్లకు పెద్దగా సహకారం లేకపోయినా, ఇంగ్లండ్ బ్యాట్స్ మెన్ మితిమీరిన ఆత్మరక్షణ ధోరణితో ఆడుతున్నారు. కాగా, మ్యాచ్ గడిచే కొద్దీ చెపాక్ పిచ్ స్పిన్నర్లకు అనుకూలించే అవకాశాలున్నాయని క్రికెట్ పండితులు అభిప్రాయపడుతున్నారు.

  • Loading...

More Telugu News