Gram Panchayat Elections: ముగిసిన ప్రచారం... ఏపీలో ఎల్లుండి తొలి దశ పంచాయతీ ఎన్నికలు
- ఫిబ్రవరి 9న తొలిదశ పంచాయతీ ఎన్నికలు
- తొలి దశలో 3,249 పంచాయతీలకు నోటిఫికేషన్
- 518 పంచాయతీలు ఏకగ్రీవం
- 2,731 పంచాయతీలకు ఎన్నికలు
ఏపీలో తొలిదశ పంచాయతీ ఎన్నికలకు నేటితో ప్రచారం ముగిసింది. రాష్ట్రంలో ఈ నెల 9న తొలిదశ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. తొలిదశలో 3,249 పంచాయతీలకు నోటిఫికేషన్ జారీ చేశారు. వాటిలో 518 పంచాయతీలు ఏకగ్రీవం కాగా, 2,731 పంచాయతీలకు ఎల్లుండి ఎన్నికలు చేపట్టనున్నారు.
ఉదయం 6.30 గంటలకు పోలింగ్ ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 3.30 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. అదే రోజు సాయంత్రం ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడిస్తారు. కాగా, అధికారులు బ్యాలెట్ బాక్సులు సిద్ధం చేసి పోలింగ్ కేంద్రాలకు తరలించడంలో నిమగ్నమయ్యారు.