Sensex: ఒడిదుడుకుల మధ్య లాభాల్లో ముగిసిన మార్కెట్లు
- 222 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
- 67 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ
- 4 శాతానికి పైగా పెరిగిన రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్
నిన్న స్వల్ప నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు మళ్లీ లాభాల బాట పట్టాయి. ఈరోజు ఉదయం నుంచీ సూచీలు ఒడిదుడుకులను ఎదుర్కొన్నప్పటికీ లాభాలను మూటగట్టుకున్నాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి 222 పాయింట్లు లాభపడి 51,532కి చేరుకుంది. నిఫ్టీ 67 పాయింట్లు పెరిగి 15,173 వద్ద స్థిరపడింది. ఎనర్జీ, టెలికాం, ఆయిల్ అండ్ గ్యాస్ సూచీలు ఈరోజు ఎక్కువ లాభాలను నమోదు చేశాయి.
టాప్ గెయినర్స్:
రిలయన్స్ ఇండస్ట్రీస్ (4.07%), సన్ ఫార్మా (2.62%), బజాజ్ ఫిన్ సర్వ్ (1.60%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (1.59%), భారతి ఎయిర్ టెల్ (1.41%).
టాప్ లూజర్స్:
టైటాన్ కంపెనీ (-2.50%), ఎల్ అండ్ టీ (-1.43%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (-0.70%), ఐటీసీ (-0.53%), ఓఎన్జీసీ (-0.50%).