AP JAC: రిటైర్డ్ ఉద్యోగులకు ఈ నెల పెన్షన్లు ఇంత వరకు రాలేదు: ఏపీ జేఏసీ ఛైర్మన్
- పెన్షన్లు రాకపోతే రిటైర్డ్ ఉద్యోగులు ఇబ్బంది పడతారు
- పెన్షన్లు ఇచ్చిన తర్వాతే మాకు జీతాలు ఇవ్వాలని సీఎస్ ను కోరాం
- 1వ తేదీనే పెన్షన్లు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరాం
11వ తేదీ వచ్చినా విశ్రాంత ఉద్యోగులకు ఇంకా పెన్షన్లు రాలేదని ఏపీ జేఏసీ ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. 1వ తేదీనే పెన్షన్లు రావాల్సి ఉందని చెప్పారు. అమరావతిలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. తొలుత పెన్షన్లు చెల్లించిన తర్వాతే తమకు జీతాలు ఇవ్వాలని ఇప్పటికే ప్రభుత్వాన్ని కోరామని చెప్పారు. ప్రతి నెల 1వ తేదీనే పెన్షన్లను చెల్లించేలా చర్యలు తీసుకోవాలని చీఫ్ సెక్రటరీని కోరామని తెలిపారు. సమయానికి పెన్షన్లు అందకపోతే రిటైర్డ్ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడతారని చెప్పారు.