CPI Narayana: కన్నతల్లి, విశాఖ స్టీల్ ప్లాంట్ రెండూ ఒకటే: సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ

Vizag Steel Plant Is Same As Mother CPI Narayana

  • స్టీల్‌ప్లాంట్ గేటు వద్ద కార్మికుల నిరాహార దీక్ష
  • పరిశ్రమ భూములు దోచుకునేందుకేనన్న నారాయణ
  • విశాఖకు పోస్కోను రానివ్వబోమని ప్రతిన

కన్నతల్లి, విశాఖ ఉక్కు పరిశ్రమ రెండూ ఒకటేనని, తల్లిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఎంత ఉందో, ఈ పరిశ్రమను కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా అంతే ఉందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు నిరసనగా విశాఖపట్టణంలోని కూర్మన్నపాలెం మెయిన్ గేట్ వద్ద స్టీల్‌ప్లాంట్ కార్మికుల సంఘాలు నేడు నిరాహార దీక్షకు దిగాయి. నారాయణ, మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, వివిధ కార్మిక సంఘాల నేతలు హాజరై దీక్షకు మద్దతు తెలిపారు.

ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ.. స్టీల్‌ప్లాంట్ భూములు దోచుకునేందుకే దానిని ప్రైవేటీకరిస్తున్నారని ఆరోపించారు. ఏదైనా పరిశ్రమకు భూములు కేటాయిస్తే వాటిని ఆ తర్వాత అమ్ముకోకుండా చట్టం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్టీల్‌ప్లాంట్ విషయంలో ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసినంత మాత్రాన సరిపోదని, ఉద్యమాన్ని తీవ్రతరం చేయాలని కోరారు. విశాఖపట్టణానికి పోస్కోను రానివ్వబోమని నారాయణ అన్నారు.

  • Loading...

More Telugu News