Tirumala: తిరుమలలో భారీగా పెరిగిన రద్దీ!

Heavy Rush in tirumala

  • వారాంతంలో పెరిగిన రద్దీ
  • నిన్న 56 వేల మందికి పైగా దర్శనం
  • రూ. 3.63 కోట్ల హుండీ ఆదాయం

గత వారాంతంలో తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. నిన్న ఆదివారం నాడు 56,448 మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారని టీటీడీ అధికారులు వెల్లడించారు. వీరిలో 27,323 మంది తలనీలాలు సమర్పించారని, హుండీ ద్వారా రూ. 3.63 కోట్ల ఆదాయం వచ్చిందని తెలిపారు.

వారాంతం కావడంతోనే రద్దీ అధికమైందని, ఈ ఉదయం స్వామి దర్శనం కోసం దాదాపు 8 వేల మంది వేచి వున్నారని తెలిపారు. ఇక, ఈ నెల 19న రథసప్తమి పర్వదినం సందర్భంగా అన్ని ఆర్జిత సేవలను రద్దు చేశామని తెలిపారు. పండగ నాడు స్వామివారు సప్తవాహనాలపై మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనం ఇస్తారని తెలిపారు.

  • Loading...

More Telugu News