India: ఉద్యోగుల అదనపు పనికి అదనంగా చెల్లించాల్సిందే.. కొత్త కార్మిక చట్టం?
- కొత్త కార్మిక చట్టం తీసుకొచ్చే దిశగా కేంద్ర సర్కారు
- ఇప్పటికే మీడియా దృష్టికి అంశాలు
- ఓవర్ టైమ్ పని చేస్తే సంస్థ వేతనం చెల్లించాల్సిందే
వారంలో నాలుగు రోజుల పని దినాలను అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోన్న విషయం తెలిసిందే. వారంలో నాలుగు రోజుల పని దినాల కోసం రోజుకు 12 గంటల పనితో అనుమతి ఇచ్చే అవకాశం ఉంది. ఒకవేళ ఉద్యోగి ఐదు రోజుల పని దినాలు చేయాలనుకుంటే రోజుకి 10 గంటల పరిమితితో అమలయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం దేశంలో ఆరు రోజుల పని దినాలతో 8 గంటల పని అమల్లో ఉన్న విషయం తెలిసిందే.
ఇప్పుడు కేంద్ర కార్మిక శాఖ మరో నూతన చట్టం తీసుకురావాలని భావిస్తోన్న నేపథ్యంలో మరో విషయం తెరమీదకు వస్తోంది. కంపెనీలో పనివేళలకు అదనంగా ఉద్యోగులు పనిచేస్తే (ఓవర్ టైమ్) కనుక అందుకు యాజమాన్యం అదనంగా వేతనం చెల్లించాల్సిందే. ఒక కార్మికుడు 15 నిమిషాలు అదనంగా పనిచేస్తే ఆ కాస్త సమయానికి కూడా కంపెనీ వేతనం చెల్లించాలని కొత్త చట్టం చెబుతోందని జాతీయ దినపత్రికలు పేర్కొంటున్నాయి. ఈ నిబంధనలను తీసుకువస్తే చట్టాల ద్వారా కార్మికులకు పని ఒత్తిడి తగ్గుతుందని, అంతేగాక, సంస్థ ఉత్పాదకత కూడా పెరుగుతుందని కేంద్ర సర్కారు భావిస్తోంది.