Ravichandran Ashwin: చెన్నై టెస్టులో అశ్విన్ సూపర్ సెంచరీ... ఇంగ్లండ్ ముందు 482 పరుగుల టార్గెట్

Ashwin registered super ton in Chennai test

  • స్పిన్ పిచ్ పై అశ్విన్ అద్భుత బ్యాటింగ్
  • స్పెషలిస్ట్ బ్యాట్స్ మన్ లా ఆడిన అశ్విన్
  • 134 బంతుల్లో 100 పరుగులు
  • టెస్టుల్లో ఐదో సెంచరీ నమోదు చేసిన అశ్విన్
  • ఒకే టెస్టులో 5 వికెట్లు, సెంచరీ

చెన్నైలో ఇంగ్లండ్ తో జరుగుతున్న రెండో టెస్టులో ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అద్భుత బ్యాటింగ్ నైపుణ్యం ప్రదర్శిస్తూ సెంచరీ సాధించాడు. మొయిన్ అలీ బౌలింగ్ లో ఫోర్ కొట్టి శతకం అందుకున్న అశ్విన్ భారత ఇన్నింగ్స్ కు మరింత ఊపు తెచ్చాడు. టెస్టుల్లో అశ్విన్ కు ఇది ఐదో సెంచరీ కాగా, ఒకే టెస్టులో 5 వికెట్లు, సెంచరీ సాధించడం అతడికిది మూడోసారి. హేమాహేమీ బ్యాట్స్ మెన్ కు సాధ్యం కాని రీతిలో ఎంతో క్లిష్టమైన స్పిన్ పిచ్ పై పూర్తి సాధికారతతో ఆడిన అశ్విన్ తన కెరీర్ లో అత్యుత్తమ ఇన్నింగ్స్ ఆడాడని చెప్పవచ్చు.

ఇక అశ్విన్ సెంచరీతో చెన్నై టెస్టులో భారత్ తిరుగులేని స్థితిలో నిలిచింది. రెండో ఇన్నింగ్స్ లో టీమిండియా 286 పరుగులకు ఆలౌటైంది. తద్వారా ఇంగ్లండ్ ముందు 482 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించింది. 106 పరుగులు చేసిన అశ్విన్... ఇంగ్లండ్ పేసర్ ఒల్లీ స్టోన్ బౌలింగ్ లో బౌల్డ్ కావడంతో భారత్ ఇన్నింగ్స్ కు తెరపడింది. అంతకుముందు అశ్విన్ ప్రోత్సాహంతో సిరాజ్ (16 నాటౌట్) కూడా దూకుడుగా ఆడాడు. సిరాజ్ స్కోరులో రెండు భారీ సిక్సులున్నాయి. అశ్విన్ స్కోరులో 14 ఫోర్లు, ఒక సిక్స్ ఉన్నాయి.

  • Loading...

More Telugu News