england: చెన్నై టెస్టులో విజ‌యానికి మూడు వికెట్ల దూరంలో భార‌త్!

  England need 366 runs

  • తొలి ఇన్నింగ్స్‌లో భార‌త్ 329 ప‌రుగులు
  • రెండో ఇన్నింగ్స్‌లో 286
  • తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 134 ప‌రుగులు
  • ఇంగ్లండ్ స్కోరు భోజ‌న విరామ స‌మ‌యానికి 116/7  

ఇంగ్లండ్‌తో చెన్నైలో జ‌రుగుతోన్న రెండో టెస్టులో విజ‌యానికి మూడు వికెట్ల దూరంలో భార‌త్ ఉంది. భార‌త బౌల‌ర్లు అశ్విన్‌, అక్ష‌ర్ ప‌టేల్ అద్భుతంగా రాణిస్తుండ‌డంతో టెస్టులో నాలుగో రోజే ఇంగ్లండ్ పై భార‌త్ విజ‌యం సాధించే అవ‌కాశాలు మెండుగా ఉన్నాయి. బౌలింగ్‌కు అనుకూలిస్తోన్న పిచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో భార‌త్ 329, రెండో ఇన్నింగ్స్‌లో 286 ప‌రుగులు చేసి ఆలౌట్ అయిన విష‌యం తెలిసిందే.
         
తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 134 పరు‌గుల‌కే ఆలౌట్ అయింది. రెండో ఇన్నింగ్స్‌ను కొన‌సాగిస్తోన్న ఇంగ్లండ్ స్కోరు 48.3 ఓవ‌ర్ల వ‌ద్ద (భోజ‌న విరామ స‌మ‌యానికి) 116/7 గా ఉంది. ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్‌లో ఎవ్వ‌రూ చెప్పుకోత‌గ్గ స్కోరు చేయ‌లేదు. బ‌ర్న్స్ 25, సిబ్లీ 3, లారెన్స్ 26, జాక్ లీచ్ 0, బెన్ స్టోక్స్ 8, పోప్ 12, బెన్ ఫోక్స్ 2 ప‌రుగులు చేశారు.

ఎక్స్‌ట్రాల రూపంలో ఇంగ్లండ్‌కు ఇప్ప‌టివ‌ర‌కు ఏడు ప‌రుగులు ద‌క్కాయి. భోజ‌న విరామ స‌మయానికి క్రీజులో కెప్టెన్‌ రూట్స్ 33 ప‌రుగుల‌తో క్రీజులో ఉన్నాడు. భార‌త్ బౌల‌ర్ల‌లో అశ్విన్‌, అక్ష‌ర్ ప‌టేల్ త‌లో మూడు వికెట్లు తీయ‌గా, కుల్‌దీప్ ఒక వికెట్ ప‌డ‌గొట్టాడు. భార‌త్ ఇప్ప‌టికీ 366 ప‌రుగుల ఆధిక్యంలో ఉంది.

  • Loading...

More Telugu News