Corona Virus: ఐదు రాష్ట్రాల్లో కరోనా కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి: కేంద్ర ఆరోగ్య శాఖ
- దేశంలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు
- కేరళ, మహారాష్ట్రల్లో అత్యధిక కేసులు
- అలసత్వం ప్రదర్శించొద్దన్న కేంద్ర ఆరోగ్యశాఖ
కొన్ని రోజులుగా మన దేశంలో కరోనా కేసులు పెరుగుతుండటం భయాందోళనలను పెంచుతోంది. వివిధ రాష్ట్రాల్లో కరోనా కంట్రోల్ లోనే ఉన్నప్పటికీ... ఐదు రాష్ట్రాల్లో మాత్రం మళ్లీ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, చత్తీస్ గఢ్, పంజాబ్, కేరళ, రాష్ట్రాల్లో రోజువారీ కేసులు మళ్లీ గణనీయంగా పెరుగుతున్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఈ రాష్ట్రాలన్నీ జాగ్రత్తగా ఉండాలని, కోవిడ్ నిబంధనలు పాటించడంలో అలసత్వం ప్రదర్శించొద్దని సూచించింది.
ఈనెల 13 నుంచి మధ్యప్రదేశ్ లో కొత్త కేసులు పెరుగుతున్నాయని తెలిపింది. మహారాష్ట్ర, కేరళలో అత్యధిక సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయని చెప్పారు. గత 24 గంటల్లో ఈ రెండు రాష్ట్రాల్లో నమోదైన కొత్త కేసుల సంఖ్య 75.87 శాతంగా ఉందని తెలిపింది. ఇదే సమయంలో 18 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కరోనా మరణాలు సున్నాగా ఉన్నాయని వెల్లడించింది.