BJP: బీజేపీ ఛలో మంథని కార్యక్రమం ప్రారంభం!
- ఇటీవల న్యాయవాద దంపతుల హత్య
- బీజేపీ లీగల్ సెల్ ఛలో మంథని కార్యక్రమం
- బయలుదేరిన 150 మంది న్యాయవాదులు
ఇటీవల న్యాయవాద దంపతులు గట్టు వామనరావు, పీవీ నాగమణి దారుణహత్యకు గురైన విషయం తెలిసిందే. దీనిపై తీవ్ర విమర్శలు గుప్పిస్తోన్న బీజేపీ తెలంగాణ నేతలు ఛలో మంథని కి పిలుపునిచ్చారు. బీజేపీ లీగల్ సెల్ ఈ కార్యక్రమాన్ని జరుపుతోంది. న్యాయవాద దంపతుల హత్యపై కేంద్ర దర్యాప్తు బృందం (సీబీఐ)తో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ రంగారెడ్డి జిల్లా కోర్టుల నుండి ఛలో మంథనికి కార్యక్రమాన్ని చేపడుతున్నారు.
ఈ కార్యక్రమాన్ని గోషా మహల్ ఎమ్మెల్యే, బీజేపీ నేత రాజాసింగ్ ప్రారంభించారు. ఇందులో భాగంగా వామనరావు కుటుంబాన్ని పరామర్శించి, వారికి భరోసా కల్పిస్తారు. ఇందుకోసం మూడు బస్సుల్లో దాదాపు 150 మంది న్యాయవాదులు మంథనికి బయల్దేరారు.