Sensex: ఐదు రోజుల నష్టాలకు బ్రేక్.. స్వల్ప లాభాల్లో ముగిసిన మార్కెట్లు!
- 7 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
- 32 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
- 5.55 శాతం లాభపడ్డ ఓఎన్జీసీ షేర్
గత ఐదు సెషన్లుగా నష్టాలను చవిచూసిన దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు మళ్లీ లాభాల బాట పడ్డాయి. రియలెస్టేట్, మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్, ఆటో స్టాకులు మార్కెట్లను ముందుండి నడిపించాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 7 పాయింట్ల లాభంతో 49,751కి పెరిగింది. నిఫ్టీ 32 పాయింట్లు పుంజుకుని 14,708 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఓఎన్జీసీ (5.55%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (2.65%), ఎల్ అండ్ టీ (2.35%), అల్ట్రాటెక్ సిమెంట్ (1.68%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (1.57%).
టాప్ లూజర్స్:
కోటక్ మహీంద్రా బ్యాంక్ (-3.87%), మారుతి సుజుకి (-1.66%), బజాజ్ ఆటో (-1.36%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (-1.26%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (-1.02%).