India: స్టేడియంలో ప్రేక్షకులు లేకుండానే ఇండియా-ఇంగ్లండ్ వన్డే సిరీస్

ODI series in pune to be conducted without spectators

  • మహారాష్ట్రలో పెరుగుతున్న కరోనా కేసులు
  • పూణెలో జరగనున్న మూడు వన్డేలు
  • అన్ని జాగ్రత్తలతో మ్యాచ్ లు నిర్వహించాలని సూచించిన ఉద్ధవ్ థాకరే

ఇండియా, ఇంగ్లండ్ మధ్య మూడు వన్డేలు జరగనున్నాయి. ఈ మూడు మ్యాచ్ లను మహారాష్ట్రలోని పూణెలో నిర్వహించనున్నారు. ఈ మ్యాచ్ లకు మహారాష్ట్ర ప్రభుత్వం ఈరోజు అనుమతి నిచ్చింది. రాష్ట్రంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో, స్టేడియంలోకి ప్రేక్షకులను అనుమతించకుండానే మ్యాచ్ లను నిర్వహించనున్నారు.

కరోనా కొత్త కేసుల నేపథ్యంలో వన్డేలను పూణే నుంచి ఇతర ప్రాంతానికి తరలించాలనే యోచనలో బీసీసీఐ ఉంది. ఈ నేపథ్యంలో సస్పెన్స్ కు ఈరోజు మహా ప్రభుత్వం ముగింపు పలికింది. ప్రేక్షకులు లేకుండానే మ్యాచ్ లను నిర్వహిస్తామని ప్రకటించింది. మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ మార్చి 23 నుంచి 28 వరకు జరగనుంది.

ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే, టూరిజం మంత్రి ఆదిత్య థాకరేలను మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు వికాస్ కాకట్కర్, గవర్నింగ్ కౌన్సిల్ ఛైర్మన్ నవరేకర్ లు ఈరోజు కలిశారు. వన్డే మ్యాచ్ ల నిర్వహణపై చర్చించారు. ఈ చర్చల అనంతరం ప్రేక్షుకులు లేకుండా మ్యాచ్ లను నిర్వహించేందుకు సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆటగాళ్లు, సపోర్ట్ స్టాఫ్ భద్రత కోసం అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు.

  • Loading...

More Telugu News