RTPCR: విదేశాల నుంచి వచ్చే వారికి ఉచిత ఆర్టీపీసీఆర్ టెస్టులు: కేరళ

Free RTPCR Tests for who arrive for abroad kerala announced

  • విమానం ఎక్కడానికి 72 గంటల ముందు ఆర్టీ-పీసీఆర్ టెస్టు తప్పనిసరి
  • విమానం దిగిన తర్వాత కూడా మరోమారు పరీక్ష
  • తలకుమించిన భారంగా మారడంతో స్పందించిన కేరళ ప్రభుత్వం

కరోనా నేపథ్యంలో విదేశాల నుంచి వచ్చే వారికి కేరళ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ప్రస్తుతం విదేశాల నుంచి వచ్చే వారికి వయసుతో సంబంధం లేకుండా ప్రయాణానికి 72 గంటల ముందు చేయించుకున్న ఆర్టీ-పీసీఆర్ టెస్టు నెగటివ్ రిపోర్టు తప్పనిసరి. అలాగే థర్మల్ స్క్రీనింగ్‌లో కరోనా లక్షణాలు లేకుంటేనే విమానం ఎక్కేందుకు అనుమతిస్తున్నారు. అలాగే, విమానం దిగిన తర్వాత సొంత ఖర్చుతో విమానాశ్రయంలో ఆర్టీ-పీసీఆర్ టెస్టు చేయించుకోవాల్సి ఉంటుంది.

విదేశాల నుంచి వచ్చే వారికి ఈ నిబంధనలు కొంత ఇబ్బందిగా మారడంతో స్పందించిన కేరళ ప్రభుత్వం నిబంధనలు కొంత సడలించింది. కరోనా కారణంగా ఉపాధి కోల్పోయి స్వదేశానికి తిరిగి వస్తున్న వారికి ఈ పరీక్షలు అదనపు భారంగా మారాయి. దీంతో పరీక్షల ఖర్చును తామే భరించాలని నిర్ణయించినట్టు కేరళ ఆరోగ్యశాఖ మంత్రి కేకే శైలజ తెలిపారు. కేరళలానే ఇతర రాష్ట్రాలు కూడా స్వదేశానికి వచ్చే వారికి ఉచిత పరీక్షలు చేయించాలని కోరుతున్నారు.

  • Loading...

More Telugu News