puja hegde: పూజ హెగ్డే బామ్మ మృతి.. హీరోయిన్‌ భావోద్వే‌గభ‌రిత ట్వీట్!

puja hegde grand mother passes away

  • ఎన్ని క‌ష్టాలు ఎదురైనా న‌వ్వుతూ ఉండాలని నేర్పింది
  • ధైర్యంగా ఉండాలని , ఇగోను ప‌క్క‌న‌బెట్టాల‌ని చెప్పేది
  • ఆమె ఎప్పుడు నాతోనే ఉంటుంది

హీరోయిన్ పూజ హెగ్డే బామ్మ మృతి చెందింది. ఈ నేప‌థ్యంలో ఆమెను గుర్తు చేసుకుంటూ పూజ హెగ్డే భావోద్వేగ‌భ‌రితంగా ట్వీట్ చేసింది. బామ్మ‌ను కోల్పోయామ‌ని, ఆమె ఎక్క‌డ ఉన్నా సంతోషంగా, ఎలాంటి బాధ‌లు లేకుండా ఉండాల‌ని ప్రార్థిస్తున్న‌ట్లు చెప్పింది. ఎన్ని క‌ష్టాలు ఎదురైనా న‌వ్వుతూ ఉండాలనే విష‌యాన్ని త‌న బామ్మ త‌మ‌కు నేర్పించిందని పూజ హెగ్డే పేర్కొంది.

ధైర్యంగా ఉండ‌డాన్ని, ఇగోను ప‌క్క‌న‌బెట్టి కావాల్సిన వారితో క‌లిసిమెల‌సి ఉండడాన్ని  త‌న బామ్మ నేర్పించింద‌ని తెలిపింది. ఆమె ఎప్పుడు త‌నతోనే ఉంటుందని, ల‌వ్ యూ ఆజీ అని పేర్కొంది. తాను సినిమా షూటింగుల్లో ఉన్న‌ స‌మ‌యంలో త‌న‌కు ఫోన్ చేసి ఎలా ఉన్నావ‌ని అడిగేద‌ని చెప్పింది. ఇప్పుడు తాను ఆమె ఫోన్ కాల్స్ ను మిస్ అవుతున్న‌ట్లు తెలిపింది. ఆమె ఆత్మకు శాంతి చేకూరాల‌ని తాను కోరుకుంటున్న‌ట్లు తెలుపుతూ త‌న బామ్మ‌తో గ‌తంలో దిగిన ఫొటోను పోస్ట్ చేసింది.


  • Loading...

More Telugu News