Supreme Court: వీడియో కాన్ఫరెన్స్ లపై వాట్సాప్ కు దూరంగా ఉండాలని సుప్రీం నిర్ణయం
- ఇకపై మెయిల్ లేదా ఫోన్ నంబర్ కే నేరుగా విచారణకు సంబంధించిన వీసీ లింకులు
- లాయర్లకు ఉత్తర్వులు జారీ చేసిన అత్యున్నత న్యాయ స్థానం
- కేంద్ర ప్రభుత్వ కొత్త మార్గదర్శకాలకు అనుగుణంగా చర్యలు
విచారణలకు సంబంధించి వీడియో కాన్ఫరెన్సుల లింకులను వాట్సాప్ ద్వారా పంపించొద్దని సుప్రీం కోర్టు నిర్ణయించింది. ఇకపై సదరు లింకులను రిజిస్టర్ చేసుకున్న ఈ మెయిల్ లేదా ఫోన్ నంబర్ కే నేరుగా పంపిస్తామని ప్రకటించింది. ఈ మేరకు లాయర్లు, సంబంధిత పార్టీలకు ఉత్తర్వులను జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (డిజిటల్ మీడియా విలువల చట్టం) నిబంధనలు 2021కి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించింది.
‘‘మార్చి 1 నుంచి విచారణలో పాల్గొనే న్యాయవాదులు, కక్షిదారులకు వారి వారి మెయిల్ అడ్రస్ కు లేదా రిజిస్టర్ చేసుకున్న ఫోన్ నంబర్ కు మెసేజ్ ద్వారా లింకులు పంపిస్తాం. సోషల్ మీడియా యాప్స్, ఓటీటీ ప్లాట్ ఫాంలపై కేంద్రం తీసుకొచ్చిన కొత్త నిబంధనలకు అనుగుణంగా ఈ చర్యలు తీసుకుంటున్నాం’’ అని ఉత్తర్వుల్లో పేర్కొంది.