Mass Weddings: ఒకే వేదికపై 3,229 వివాహాలు... చత్తీస్ గఢ్ లో అరుదైన వేడుక
- రాయ్ పూర్ ఇండోర్ స్టేడియంలో సామూహిక వివాహాలు
- అన్ని వర్గాలు హాజరైన వైనం
- సీఎం సమక్షంలో పెళ్లిళ్లు
- వధూవరులను ఆశీర్వదించిన సీఎం భూపేశ్ భగేల్
- సీఎం కన్యా వివాహ యోజన కింద వివాహాలు
- గోల్డెన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం
చత్తీస్ గఢ్ రాజధాని రాయ్ పూర్ అరుదైన వేడుకకు వేదికగా నిలిచింది. సీఎం భూపేశ్ భగేల్ సాక్షిగా నేడు జరిగిన ఓ కార్యక్రమంలో 3,229 జంటలు ఒకే వేదికపై పెళ్లి చేసుకున్నాయి. విశేషం ఏంటంటే... ఈ జంటల్లో అన్ని మతాల వారు ఉన్నారు. హిందూ, క్రైస్తవులు, ముస్లింలు, బౌద్ధులు ఈ సామూహిక వేడుక ద్వారా ఒక్కటయ్యారు.
చత్తీస్ గఢ్ లోని 22 జిల్లాలకు చెందిన వధూవరులు ఈ వివాహ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాయ్ పూర్ ఇండోర్ స్టేడియంలో జరిగిన ఈ వేలాది జంటల వివాహ కార్యక్రమం గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం దక్కించుకుంది. ఈ భారీ పెళ్లి వేడుకను రాష్ట్ర మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ సీఎం కన్యా వివాహ యోజన పథకం కింద నిర్వహించింది.