Revanth Reddy: కేసీఆర్ ఎంపీగా ఉన్నప్పుడు పార్లమెంటు హాజరుపట్టికలో వేరొకరితో సంతకాలు చేయించారు: రేవంత్ రెడ్డి ఆరోపణలు

Revanth Reddy made allegations on CM KCR

  • కేసీఆర్ రహస్యం వెల్లడిస్తానంటూ ఇటీవల సంజయ్ వ్యాఖ్యలు
  • తాను లిఖితపూర్వక ఫిర్యాదు చేస్తానన్న రేవంత్
  • చర్యలు తీసుకునే దమ్ము బీజేపీకి ఉందా? అంటూ సవాల్
  • కేసీఆర్, బండి సంజయ్ ఒకటేనని వ్యాఖ్యలు

ఇటీవల తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ సీఎం కేసీఆర్ పై వ్యాఖ్యానిస్తూ... ఆయన పార్లమెంటునే తప్పుదోవ పట్టించాడని, ఆ కుంభకోణాన్ని తాను త్వరలోనే బట్టబయలు చేస్తానని అనడం తెలిసిందే. స్పీకర్ అనుమతి కోసం చూస్తున్నానని అన్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

 కేసీఆర్ ఎంపీగా ఉన్న సమయంలో తాను పార్లమెంటుకు హాజరు కాకున్నప్పటికీ, వచ్చినట్టుగా హాజరుపట్టికలో తన బదులు మరొకరితో సంతకాలు చేయించారని వెల్లడించారు. పార్లమెంటు సమావేశాలకు హాజరుకాకుండానే హాజరైనట్టుగా మరొకరితో సంతకాలు చేయించారని వివరించారు.

అయితే కేసీఆర్ పార్లమెంటును తప్పుదోవ పట్టించడంపై తాను లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తానని, చర్యలు తీసుకునే ధైర్యం బీజేపీకి ఉందా? అని రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. పార్లమెంటులో ఆ సంతకాలు ఎవరివో బండి సంజయ్ ఫోరెన్సిక్ పరీక్ష చేయించగలడా? కేసీఆర్ పార్లమెంటుకు ఎన్నిసార్లు హాజరయ్యాడు? అని ప్రశ్నించారు.

వాస్తవానికి బండి సంజయ్, కేసీఆర్ విడివిడిగా కనిపించినా, వారిద్దరూ ఒక్కటేనని అన్నారు. బండి, కారు ఒక్కటేనని విమర్శించారు. కేసీఆర్ చదువుకుంది బీఏనే అని, కానీ ఎంఏ చదువుకున్నట్టు పార్లమెంటుకు తప్పుడు సమాచారం అందించారని రేవంత్ రెడ్డి ఆరోపించారు.

  • Loading...

More Telugu News