Summer: ఈ ఏడాది ఎండ ప్రచండమే..: హెచ్చరించిన వాతావరణ శాఖ!

More Summer Tempareture This Year Says IMD

  • 42 డిగ్రీల వరకూ వేడిమి
  • సాయంత్రమైనా ఉక్కపోతకు అవకాశం
  • ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచన

ఈ సంవత్సరం భానుడి ప్రతాపం అధికంగా ఉంటుందని, సాధారణంగా వేసవిలో నమోదయ్యే సగటు ఉష్ణోగ్రతలతో పోలిస్తే, ఈ సంవత్సరం మరింత వేడిమిని భరించాల్సి వుంటుందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ విషయంలో ప్రజలు తగు జాగత్తలు తీసుకోవాలని కోరింది. ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లతో పాటు తమిళనాడు, కర్ణాటకల్లో వేడిమి అధికంగా ఉంటుందని, రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది.

సాధారణ పరిస్థితుల్లో ఉదయం నుంచి పెరిగే ఎండలు సాయంత్రానికి కాస్తంత ఉపశమనాన్ని ఇస్తాయని, కానీ ఈ సంవత్సరం సాయంత్రంలోనూ తీవ్రమైన ఉక్కపోతను అనుభవించాల్సి వుంటుందని, వేసవి వేడిమి 42 డిగ్రీల సెల్సీయస్ వరకూ చేరవచ్చని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు.

  • Loading...

More Telugu News