KTR: మేం ఉద్యోగాల గురించి మాట్లాడితే మోదీ పకోడీల గురించి మాట్లాడతారు: కేటీఆర్

KTR comments on PM Modi and BJP leaders

  • హైదరాబాదులో టీఆర్ఎస్వీ సమావేశం
  • హాజరైన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
  • బీజేపీకి ఓటు ద్వారా సమాధానం చెప్పాలని పిలుపు
  • బీజేపీ నేతలకు తెలంగాణ కనిపించడం లేదా? అని వ్యాఖ్యలు
  • మోదీ మాటలు కోట్లల్లో... చేతలు పకోడీల్లా ఉంటాయని వ్యంగ్యం

హైదరాబాద్ తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ విద్యార్థి విభాగం (టీఆర్ఎస్వీ) విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బీజేపీపై విమర్శలు చేశారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు ద్వారా బీజేపీకి యువత సరైన సమాధానం చెప్పాలని పిలుపునిచ్చారు. బీజేపీ నేతలకు తెలంగాణ భారతదేశంలో ఉన్నట్టు కనిపించడం లేదా? అని ప్రశ్నించారు.

తాము గణాంకాలతో సహా అభివృద్ధి గురించి చెబుతుంటే బీజేపీ కేవలం మాటలతో సరిపెడుతోందని విమర్శించారు. తాము ఉద్యోగాల కల్పన గురించి మాట్లాడితే ప్రధాని మోదీ పకోడీల గురించి మాట్లాడతారని వివరించారు. బాత్ కరోడోంమే... కామ్ పకోడీమే అంటూ... మోదీ మాటలు కోట్లల్లో ఉంటాయని, చేతలు మాత్రం పకోడీల్లా ఉంటాయని ఎద్దేవా చచేశారు. 20 లక్షల కోట్ల ఆత్మనిర్భర్ ప్యాకేజీ అన్నారు... ఒక్కరైనా దానివల్ల లబ్దిపొందారా? అని కేటీఆర్ ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News