UNICEF: ప్రపంచవ్యాప్తంగా 65 కోట్ల మంది మహిళలకు బాల్యంలోనే వివాహాలు.. టాప్-5లో భారత్!

India in fourth place in child marriages

  • బాల్య వివాహాల జాబితాలో బంగ్లాదేశ్ టాప్  
  • నాలుగో స్థానంలో నిలిచిన భారత్
  • కరోనా కారణంగా పెరిగే బాల్య వివాహాలు  

ప్రపంచవ్యాప్తంగా అమ్మాయిల్లో బాల్య వివాహాలు జరుగుతున్న దేశాల జాబితాలో భారత్ టాప్-5లో నిలిచింది. ఈ మేరకు యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్ (యూనిసెఫ్) తెలిపింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వున్న మహిళల్లో దాదాపు 65 కోట్ల మంది మహిళలకు బాల్యంలోనే వివాహాలు జరిగాయని పేర్కొన్న యూనిసెఫ్.. వీరిలో సగం మంది ఐదు దేశాలకు చెందిన వారేనని తెలిపింది. ఈ ఐదు దేశాల్లో భారత్‌ది నాలుగో స్థానం.

బాలికలకు అత్యధికంగా పెళ్లిళ్లవుతున్న దేశాల జాబితాలో బంగ్లాదేశ్ మొదటి స్థానంలో ఉండగా, ఆ తర్వాతి స్థానంలో బ్రెజిల్, ఇథియోపియా, భారత్, నైజీరియా ఉన్నాయి. ఈ దేశాల్లోని 30-35 కోట్ల మంది మహిళలకు 18 ఏళ్ల లోపే వివాహం జరిగినట్టు యూనిసెఫ్ పేర్కొంది. కరోనా కారణంగా బాల్య వివాహాలు మళ్లీ ఊపందుకునే అవకాశం ఉందని, వచ్చే దశాబ్దకాలంలో 10 కోట్ల మంది బాలికలు పెళ్లి పీటలు ఎక్కే అవకాశం ఉందని యూనిసెఫ్ అంచనా వేసింది.

  • Loading...

More Telugu News