Sensex: భారీ లాభాల్లో ముగిసిన మార్కెట్లు
- 584 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
- 142 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
- 3.35 శాతం లాభపడ్డ కోటక్ మహీంద్రా బ్యాంక్
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ లాభాల్లో ముగిశాయి. కీలక రంగాల్లో కొనుగోళ్ల మద్దతు లభించడంతో మార్కెట్లు లాభాలను ఆర్జించాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 584 పాయింట్లు లాభపడి 51,025కి చేరుకుంది. నిఫ్టీ 142 పాయింట్లు ఎగబాకి 15,098 వద్ద స్థిరపడింది. బ్యాంకెక్స్, ఫైనాన్స్, ఐటీ. టెక్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ సూచీలు లాభాల్లో ట్రేడ్ అయ్యాయి.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
కోటక్ మహీంద్రా బ్యాంక్ (3.35%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (2.85%), ఐసీఐసీఐ బ్యాంక్ (2.80%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (2.68%), టెక్ మహీంద్రా (2.04%).
టాప్ లూజర్స్:
పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (-1.97%), ఓఎన్జీసీ (-1.23%), ఎన్టీపీసీ (-1.00%), డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ (-0.95%), భారతి ఎయిర్ టెల్ (-0.77%).