K Kavitha: 10 ఏళ్ల క్రితం ఇదే రోజున మిలియన్ మార్చ్‌లో పాల్గొన్న వీడియోను పోస్ట్ చేసిన ఎమ్మెల్సీ కవిత!
- ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో కీలక ఘట్టం మిలియన్ మార్చ్
- ఉద్యోగ సంఘాల నేతలు, విద్యార్థి, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మార్చ్
- కీలక పాత్ర పోషించిన తెలంగాణ జేఏసీ
- పాల్గొన్న వారందరికీ సెల్యూట్ అంటూ కవిత పోస్ట్
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో భాగంగా సరిగ్గా పదేళ్ల క్రితం ఇదే రోజున మిలియన్ మార్చ్ ను నిర్వహించారు. హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్ వేదికగా నిర్వహించిన ఈ మార్చ్‌లో ఉద్యోగ సంఘాల నేతలు, విద్యార్థి, ప్రజా సంఘాలు, పలు పార్టీల నేతలు పాల్గొన్నారు.
తెలంగాణ ఉద్యమ చరిత్రలోనే ఈ మిలియన్ మార్చ్ కీలక ఘట్టంగా మిగిలిపోయింది. ఎన్నో అవరోధాల నడుమ ఈ మార్చ్‌ను ప్రొఫెసర్ కోదండరాం ఆధ్వర్యంలోని తెలంగాణ జేఏసీ విజయవంతం చేసింది.
ఇందులో తాను కూడా పాల్గొన్నానని చెబుతూ టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఓ వీడియో పోస్ట్ చేశారు. మిలియన్ మార్చ్‌లో పాల్గొన్న తెలంగాణ ప్రజలకు, వారి స్ఫూర్తికి వందనం చేస్తున్నానని చెప్పారు. ఇందులో అందరూ కలిసికట్టుగా నిలబడి చరిత్ర సృష్టించామని పేర్కొన్నారు.