Andhra Pradesh: ఏపీలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు.. 24 గంటల్లో 200కు పైగా కొత్త కేసులు
- చిత్తూరు జిల్లాలో కొత్తగా 85 కేసుల నమోదు
- రాష్ట్ర వ్యాప్తంగా 210 పాజిటివ్ కేసుల నిర్ధారణ
- ప్రస్తుతం రాష్ట్రంలో 1,227 యాక్టివ్ కేసులు
ఏపీలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. కొన్ని రోజుల క్రితం భారీగా తగ్గుముఖం పట్టిన కేసులు... ఒకానొక రోజు కేవలం 30 వరకే నమోదయ్యాయి. అయితే గత కొన్ని రోజులుగా మహమ్మారి మళ్లీ తన ప్రభావాన్ని చూపుతోంది. గత 24 గంటల్లో 210 కేసులు నమోదయ్యాయి.
చిత్తూరు జిల్లాలో మహమ్మారి తీవ్రత ఎక్కువగా ఉంది. ఈ జిల్లాలో ఏకంగా 85 కేసులు నమోదయ్యాయి. 41 కేసులతో తూర్పుగోదావరి జిల్లా రెండో స్థానంలో ఉంది. విజయనగరం జిల్లాలో అత్యల్పంగా ఒక్క కేసు నమోదైంది. ఇదే సమయంలో కృష్ణా జిల్లాలో ఒకరు కరోనా వల్ల ప్రాణాలు కోల్పోయారు.
తాజా గణాంకాలతో కలిపి ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 8,91,388కి చేరుకున్నాయి. మొత్తం 8,82,981 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 7,180 మంది ఇప్పటి వరకు మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,227 యాక్టివ్ కేసులు ఉన్నాయి.