Narendra Modi: దేశంలో మళ్లీ కరోనా విజృంభణ... సీఎంలతో సమావేశం కానున్న ప్రధాని మోదీ
- అనేక రాష్ట్రాల్లో అధికమవుతున్న కొత్త కేసులు
- ఈ నెల 17న సీఎంలతో మోదీ భేటీ
- వర్చువల్ విధానంలో సమావేశం
- కరోనా వ్యాప్తి, నివారణ, నియంత్రణ చర్యలపై చర్చ
దేశంలోని అన్ని ప్రాంతాల్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులతో సమావేశం కానున్నారు. ఈ నెల 17న వర్చువల్ విధానంలో సీఎంలతో సమావేశం నిర్వహించనున్నారు. కొత్త కేసుల సంఖ్య వృద్ధి, కరోనా నివారణ, నియంత్రణ చర్యలపై వారితో చర్చించనున్నారు. బుధవారం మధ్యాహ్నం 12.30 గంటలకు ఈ సమావేశం జరగనుంది. దేశవ్యాప్తంగా అమలవుతున్న కరోనా వ్యాక్సినేషన్ పై సీఎంల అభిప్రాయాలు అడిగి తెలుసుకోనున్నారు. కాగా, కరోనా మళ్లీ తీవ్రతరం అవుతుండడంతో మహారాష్ట్ర వంటి పలు రాష్ట్రాలు కేసులు అధికంగా ఉన్న ప్రాంతాల్లో లాక్ డౌన్, రాత్రివేళ కర్ఫ్యూలు విధిస్తున్నాయి.