Jagan: మున్సిపల్ ఎన్నికలు పూర్తయిన వెంటనే పరిషత్ ఎన్నికలు జరిపితే బాగుండేది: సీఎం జగన్
- రాష్ట్రంలో కరోనా వ్యాప్తి
- క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ సమీక్ష
- వ్యాక్సినేషన్ కు ఎన్నికల ప్రక్రియ అడ్డుతగిలిందని వెల్లడి
- ఎన్నికలు పూర్తయితేనే వ్యాక్సినేషన్ ఊపందుకుంటుందన్న సీఎం
కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండడం పట్ల సీఎం జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో వీలైనంత త్వరగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు పూర్తి చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. మున్సిపల్ ఎన్నికలు ముగిసిన వెంటనే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు కూడా జరిపితే బాగుండేదని, స్థానిక ఎన్నికలు పూర్తయితేనే కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగం పుంజుకుంటుందని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ కు ఎన్నికల ప్రక్రియ అడ్డుతగిలిందని పేర్కొన్నారు. స్థానిక ఎన్నికలు ఆలస్యం అవుతుండడం పట్ల గవర్నర్ కు నివేదించాలని, ఈ అంశాన్ని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లాలని సీఎం జగన్ అధికారులకు నిర్దేశించారు.