Harsha Kumar: సీఎం జగన్ కు కూడా సీఐడీ నోటీసులు ఇవ్వకపోతే కోర్టుకు వెళతాం: మాజీ ఎంపీ హర్షకుమార్

Former MP Harsha Kumar wants CID should send notices CM Jagan too
  • అమరావతి భూముల అంశంలో ఎమ్మెల్యే ఆర్కే ఫిర్యాదు
  • చంద్రబాబుకు నోటీసులు
  • జగన్ దళితుల భూములు లాక్కున్నారన్న హర్షకుమార్
  • సీఐడీ డీజీకి వివరాలు సమర్పిస్తామని వెల్లడి
అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి చేసిన ఫిర్యాదు ఆధారంగా సీఐడీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసు దర్యాప్తులో భాగంగా సీఐడీ అధికారులు టీడీపీ అధినేత చంద్రబాబుకు, మాజీ మంత్రి నారాయణకు నోటీసులు జారీ చేశారు. అయితే, ఈ కేసులో సీఎం జగన్ కు కూడా సీఐడీ నోటీసులు ఇవ్వాలని మాజీ ఎంపీ హర్షకుమార్ డిమాండ్ చేశారు. సీఎంకు నోటీసులు ఇవ్వకపోతే తాము కోర్టుకు వెళతామని స్పష్టం చేశారు.

పేదలకు ఇళ్ల స్థలాల పేరిట దళితుల భూములను సీఎం జగన్ లాక్కున్నారని ఆరోపించారు. దళితులకు నాడు ఇందిరాగాంధీ, ఎన్టీఆర్, వైఎస్సార్ భూములు ఇచ్చారని, ఇప్పుడా భూములను లాగేసుకున్నారని హర్షకుమార్ వివరించారు. అందుకే చంద్రబాబుకు ఇచ్చినట్టే సీఎం జగన్ కు కూడా నోటీసులు ఇవ్వాలని కోరారు. వైసీపీ సర్కారు దళితుల నుంచి అసైన్డ్ భూములను లాగేసుకున్న వివరాలను సీఐడీ డీజీ సునీల్ కుమార్ కు అందజేస్తామని ఈ మాజీ ఎంపీ వెల్లడించారు. రాజమండ్రిలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Harsha Kumar
YS Jagan
CID
Chandrababu
Amaravati
Insider Trading

More Telugu News