Varla Ramaiah: రిమాండ్ ఖైదీగా ఉన్నప్పుడు జగన్ బెయిల్ ఎందుకు తెచ్చుకున్నారు?: వర్ల రామయ్య
- అక్రమాస్తుల కేసులో జగన్ రిమాండ్ ఖైదీగా ఉన్నారు
- బెయిల్ తెచ్చుకోవడం ఆయన ప్రాథమిక హక్కు
- అదే హక్కుతో చంద్రబాబు కోర్టును ఆశ్రయించారు
అమరావతి అసైన్డ్ భూముల వ్యవహారంలో టీడీపీ అధినేత చంద్రబాబుకు సీఐడీ నోటీసులు ఇచ్చిన తర్వాత ఏపీ రాజకీయం వేడెక్కింది. చంద్రబాబు తప్పు చేయకపోతే విచారణకు హాజరు కావాలని వైసీపీ నేతలు అంటున్నారు. ఇది ముమ్మాటికీ రాజకీయ కక్ష సాధింపని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ నేత వర్ల రామయ్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
అక్రమాస్తుల కేసులో జగన్ ను సీబీఐ అరెస్ట్ చేసి, చంచల్ గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా పెట్టినప్పుడు ఆయన బెయిల్ ఎందుకు తెచ్చుకున్నారని ప్రశ్నించారు. కేసులో నిజాలు తేలేంత వరకు జైల్లోనే ఉండొచ్చు కదా? అని ప్రశ్నించారు. బెయిల్ తెచ్చుకోవడం ఆయన ప్రాథమిక హక్కు కాబట్టి జగన్ బెయిల్ తెచ్చుకున్నారని అన్నారు. చంద్రబాబు కూడా అదే హక్కుతో కోర్టును ఆశ్రయించారని... ఇది తప్పా? అని ప్రశ్నించారు.