Joe Biden: 100 రోజుల లక్ష్యాన్ని 58 రోజుల్లోనే సాధించిన బైడెన్ సర్కారు

Biden Govt Reached Vaccination Goal In Just 58 Days

  • వంద రోజుల్లో 10 కోట్ల మందికి టీకా వేయాలని లక్ష్యం
  • బైడెన్ ప్రమాణ స్వీకార సమయానికి 2 కోట్ల మందికి వ్యాక్సిన్
  • ఇప్పటి వరకు 11.57 కోట్ల మందికి టీకా

కరోనా వ్యాక్సినేషన్ విషయంలో అమెరికాలోని బైడెన్ ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యాన్ని సగం రోజుల్లోనే పూర్తిచేసింది. ట్రంప్‌ను ఓడించి అధికారంలోకి వచ్చిన తర్వాత 100 రోజుల్లో 10 కోట్ల మందికి కరోనా టీకా వేయాలన్న లక్ష్యాన్ని బైడెన్ ప్రభుత్వం నిర్దేశించుకుంది. అయితే, ఈ లక్ష్యాన్ని 58 రోజుల్లోనే సాధించినట్టు తాజాగా ప్రభుత్వం వెల్లడించింది.

బైడెన్ ప్రమాణ స్వీకారం చేసే సమయానికి దేశవ్యాప్తంగా దాదాపు 2 కోట్ల కరోనా డోసులను మాత్రమే పంపిణీ చేశారు. ఆ తర్వాత ఈ రెండు నెలల్లో ఏకంగా 10 కోట్ల మందికి టీకా వేసినట్టు ప్రభుత్వం తెలిపింది. అమెరికాలో ఇప్పటి వరకు 11.57 కోట్ల మందికి వ్యాక్సిన్ వేశారు. వీరిలో 7.54 కోట్ల మంది తొలి డోసు తీసుకోగా, 4 కోట్ల మంది రెండో డోసు కూడా తీసుకున్నట్టు ప్రభుత్వం పేర్కొంది.

  • Loading...

More Telugu News