mlc: తెలంగాణలో కొన‌సాగుతోన్న ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల ఓట్ల లెక్కింపు

mlc eletions counting going on

  • ‌హైదరాబాద్‌లో 87 మంది ఎలిమినేషన్ ‌
  • ముందంజ‌లో వాణీదేవి
  • నల్గొండలో 67 మంది అభ్యర్థులు ఎలిమినేషన్  
  • ముందంజ‌లో ప‌ల్లా రాజేశ్వ‌ర్ రెడ్డి

తెలంగాణ‌లో ఎమ్మెల్సీ ఎన్నిక‌ల ఓట్ల లెక్కింపు ప్ర‌క్రియ కొన‌సాగుతోంది. ‌హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ స్థానంలో మొద‌టి ప్రాధాన్య‌త ఓట్ల లెక్కింపులో ఏ అభ్య‌ర్థికీ విజ‌యానికి కావాల్సిన ఆధిక్య‌త రాలేద‌న్న విష‌యం తెలిసిందే. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో వారి విజేత తేలే అవ‌కాశం ఉంది.

ఇక ఈ స్థానంలో మొత్తం 93 మందిలో ఇప్పటివరకు 87 మంది ఎలిమినేట్‌ అయ్యారు. దీంతో టీఆర్ఎస్‌ అభ్యర్థి వాణీదేవికి 3,930, బీజేపీ అభ్యర్థి రాంచందర్‌రావుకు 1,916, ప్రొ.నాగేశ్వర్‌కు 2,477, కాంగ్రెస్‌ అభ్యర్థి చిన్నారెడ్డికి 2,044 ఎలిమినేషన్‌ ఓట్లు బదిలీ అయ్యాయి. మొత్తంగా వాణీదేవికి 1,16,619, రాంచందర్‌రావుకు 1,06,584,  ప్రొ.నాగేశ్వర్‌కు 56,087, చిన్నారెడ్డికి 33,598 ఓట్లు వచ్చాయి.

మ‌రోవైపు, వరంగల్-నల్గొండ-ఖమ్మం స్థానంలో ఇప్పటివరకు 67 మంది అభ్యర్థులు ఎలిమినేట్ అయ్యారు. దీంతో పల్లా రాజేశ్వర్ రెడ్డికి 6,546, తీన్మార్ మల్లన్నకు 8,568, కోదండరాంకు 9,038 ఓట్లు జమ అయ్యాయి. పల్లా రాజేశ్వర్‌రెడ్డికి మొత్తం 1,17,386, తీన్మార్‌ మల్లన్నకు 91,858, కోదండరాంకు 79,110, ప్రేమేందర్‌రెడ్డికి 42,015 ఓట్లు వచ్చాయి.

  • Loading...

More Telugu News