BJP: 'సంకల్ప్ పత్ర' పేరుతో బెంగాల్ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన బీజేపీ
- మరికొన్ని రోజుల్లో బెంగాల్ లో అసెంబ్లీ పోల్స్
- మార్చి 27 నుంచి ఏప్రిల్ 29 వరకు ఎన్నికలు
- అధికారం కోసం గట్టిగా ప్రయత్నిస్తున్న బీజేపీ
- మేనిఫెస్టో విడుదల చేసిన అమిత్ షా
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు ఈ నెల 27 నుంచి ఏప్రిల్ 29 వరకు 8 విడతల్లో జరగనున్నాయి. బెంగాల్ అధికార పీఠాన్ని చేజిక్కించుకోవాలన్న దృఢనిశ్చయంతో ప్రచారం నిర్వహిస్తున్న బీజేపీ ఇవాళ మేనిఫెస్టో విడుదల చేసింది. 'సంకల్ప్ పత్ర' పేరుతో రూపొందించిన ఈ మేనిఫెస్టోను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కోల్ కతాలో విడుదల చేశారు.
బీజేపీ మేనిఫెస్టో ముఖ్యాంశాలు...
- బెంగాల్ రైతులకు ఏటా రూ.4 వేల ఆర్థికసాయం
- కేంద్రం ఇచ్చే రూ.6 వేలతో కలిపి ఏటా రూ.10 వేలు అందజేత
- శరణార్థుల కుటుంబాలకు ఏటా రూ.10 వేల ఆర్థికసాయం
- 70 ఏళ్లుగా బెంగాల్ లో ఉంటున్న వారికి పౌరసత్వం
- 33 శాతం ఉద్యోగాలు మహిళలకు కేటాయింపు
- రాష్ట్రంలో బాలికలకు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య
- మత్స్యకారులకు ఏటా రూ.6 వేల ఆర్థికసాయం
- బెంగాల్ లో మూడు చోట్ల ఎయిమ్స్ ఆసుపత్రులు
- రూ.11 వేల కోట్లతో 'సోనార్ బంగ్లా' నిధి ఏర్పాటు
- రూ.22 వేల కోట్లతో కోల్ కతా అభివృద్ధి నిధి
- రూ.1000 కోట్లతో సరికొత్త టూరిజం పాలసీ
- రాష్ట్రంలో క్రీడా విశ్వవిద్యాలయం ఏర్పాటు
- క్రీడల అభివృద్ధికి రూ.2000 కోట్లు
- ఐఐటీలు, ఐఐఎంలకు దీటైన 5 యూనివర్సిటీల స్థాపన
- ఆశా వర్కర్ల కనీసం వేతనం రూ.4,500 నుంచి రూ.6 వేలకు పెంపు