VMRDA: విశాఖ మెట్రో రీజియన్ డెవలప్ మెంట్ అథారిటీ పరిధి పెంపు
- నోటిఫికేషన్ జారీ చేసిన సర్కారు
- 431 గ్రామాలు వీఎంఆర్డీఏలో విలీనం
- మరింతగా పెరిగిన వీఎంఆర్డీఏ పరిధి
- 7,328 చ.కి.మీ పెరిగిన పరిధి
విశాఖ మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్ మెంట్ అథారిటీ (వీఎంఆర్డీఏ) పరిధి పెంపుపై ఏపీ సర్కారు నిర్ణయం తీసుకుంది. వీఎంఆర్డీఏ పరిధిలోకి మరో 13 మండలాలను తీసుకువస్తూ తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది. నర్సీపట్నం, నాతవరం, బుచ్చయ్యపేట, చీడికాడ, గొలుగొండ, రోలుగుంట, దేవరాపల్లి, మాకవరపాలెం, కోటవురట్ల, రావికమతం, చోడవరం, కె.కోటపాడు, మాడుగుల మండలాలు ఇకపై విశాఖ మెట్రో పరిధిలోకి వస్తాయి. ఈ 13 మండలాల్లోని 431 గ్రామాలు ఇక వీఎంఆర్డీఏ కిందకు వస్తాయి. విలీనం అనంతరం వీఎంఆర్డీఏ పరిధి 7,328 చదరపు కిలోమీటర్లు పెరిగినట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.