Virat Kohli: సచిన్ రికార్డును కోహ్లీ సమం చేస్తాడా?
- స్వదేశంలో అత్యధిక శతకాలకు ఒక్క సెంచరీ దూరంలో కోహ్లీ
- 20 సెంచరీలు చేసిన సచిన్
- 19 సెంచరీలతో విరాట్ కోహ్లీ
- ఇంగ్లండ్ పై అత్యధిక సెంచరీల రికార్డుకూ ఒక్క అడుగు దూరంలోనే
సచిన్ టెండూల్కర్.. అనగానే క్లాస్ షాట్లు, మాస్టర్ స్ట్రోక్స్, రికార్డులే గుర్తొస్తాయి. అంతర్జాతీయ మ్యాచ్ లలో వంద శతకాలు, వన్డేల్లో క్రికెట్ చరిత్రలోనే మొదటి ద్విశతకం, వేల కొద్దీ పరుగులు.. చెప్పుకొంటూ పోతే ఎన్నెన్ని రికార్డులో. సచిన్ సాధించిన ఆ రికార్డులను మరే ఇతర ఆటగాడు బ్రేక్ చేయొద్దని అభిమానులు కోరుకుంటూ ఉంటారు.
అయితే, సచిన్ స్థాయిలోనే చెలరేగిపోతున్న కింగ్ కోహ్లీ.. సచిన్ ఖాతాలోని ఓ రికార్డుకు అతి దగ్గరగా వచ్చేశాడు. మాస్టర్ ను సమం చేసేందుకు రెడీ అవుతున్నాడు. స్వదేశంలో సచిన్ టెండూల్కర్ 20 శతకాలు బాదాడు. అందుకు విరాట్ కోహ్లీ ఒక్క శతకం దూరంలో ఉన్నాడు. ప్రస్తుతం స్వదేశంలో 19 శతకాలు బాదిన విరాట్.. ప్రస్తుతం ఇంగ్లండ్ తో జరుగుతున్న రెండో వన్డేలో మరొకటి బాది సచిన్ రికార్డును సమం చేస్తాడేమో చూడాలి.
ఇక, ఇంగ్లండ్ పై అత్యధిక సెంచరీలు కొట్టిన ఆటగాడిగానూ యువరాజ్ తో కలిసి రికార్డును పంచుకునేందుకు సిద్ధమవుతున్నాడు. ఇంగ్లిష్ టీంపై ఒక భారత బ్యాట్స్ మన్ బాదిన అత్యధిక శతకాల రికార్డు యువీ (4) పేరిట ఉంది. 3 సెంచరీలు చేసిన విరాట్.. మరో సెంచరీ సాధిస్తే యువీని సమం చేస్తాడు.