Priyanka: ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న తొలి మహిళా ఎస్ఐ ప్రియాంక.. గ్యాంగ్ స్టర్ల అరెస్ట్!

First woman SI to participate in an encounter

  • ఢిల్లీ పోలీసు క్రైమ్ బ్రాంచ్ లో పని చేస్తున్న ప్రియాంక
  • ప్రగతి మైదానం ఎన్ కౌంటర్ లో పాలుపంచుకున్న వైనం
  • ఢిల్లీ పోలీసు ఉన్నతాధికారుల ప్రశంసలు  

మహిళా ఎస్ఐ ప్రియాంక అరుదైన రికార్డును సాధించారు. మన దేశంలో ఎన్ కౌంటర్ లో పాల్గొన్న తొలి పోలీసు అధికారిణిగా చరిత్ర పుటల్లోకి ఎక్కారు. 2008లో ఢిల్లీ పోలీసు క్రైమ్ బ్రాంచ్ లో ఆమె ఎస్ఐగా చేశారు. తాజాగా ప్రగతి మైదానంలో జరిగిన ఎన్ కౌంటర్ లో పురుష సిబ్బందితో పాటు ఆమె కూడా పాల్గొన్నారు. ఈ ఎన్ కౌంటరులో గ్యాంగ్ స్టర్ రోహిత్ చౌదరి, అతని సహచరుడు పర్వీన్ అలియాస్ టిటును ప్రియాంక అరెస్ట్ చేశారు.

ఎన్ కౌంటర్ సందర్భంగా గ్యాంగ్ స్టర్లు ప్రియాంకపై కాల్పులు జరిపారు. అయితే తూటా ఆమె వేసుకున్న బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ కు తగిలింది. దీంతో, ఆమె సురక్షితంగా బయటపడ్డారు. ఎన్ కౌంటర్ లో గాయపడిన రోహిత్ చౌదరి, టిటూలను ఆర్ఎంఎల్ ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా ఢిల్లీ అదనపు పోలీస్ కమిషనర్ శిబేశ్ సింగ్ మాట్లాడుతూ, ఎన్ కౌంటర్ లో పాల్గొన్న తొలి మహిళా ఎస్ఐగా ప్రియాంక పేరు పొందారని చెప్పారు. ప్రియాంకను ఢిల్లీ పోలీసు ఉన్నతాధికారులు అభినందించారు.

  • Loading...

More Telugu News