Chhattisgarh: రోగ నిరోధకశక్తిని బలహీనం చేసే కొత్తరకం వేరియంట్‌.. చత్తీస్‌గఢ్‌లో గుర్తింపు

Scientists find corona virus new variant in Chhattishgarh

  • ఐదు వేర్వేరు నమూనాలను పరీక్షించిన అనంతరం నిర్ధారణ
  • కొత్త వేరియంట్ ఉనికిని నిర్ధారించిన కేంద్రం
  • ప్రాణాంతకం కాదన్న చత్తీస్‌గఢ్ ఆరోగ్య మంత్రి

శరీరంలోని రోగ నిరోధక శక్తిని బలహీనం చేసే కరోనా వైరస్‌లోని కొత్త వేరియంట్ ఒక దానిని చత్తీస్‌గఢ్‌లో గుర్తించారు. ఐదు వేర్వేరు నమూనాలను పరీక్షించిన అనంతరం ఈ వేరియంట్‌ను నిర్ధారించారు. దీనికి ఎన్-440గా నామకరణం చేశారు. దేశంలో వైరస్ వ్యాప్తి కొనసాగుతున్న వేళ రోగ నిరోధకశక్తిని పిప్పిచేసే వేరియంట్ బయటపడడం ఆందోళన కలిగిస్తోంది.

కొత్త వేరియంట్ ఉనికిని కేంద్ర ప్రభుత్వం కూడా నిర్ధారించింది. చత్తీస్‌గఢ్ ఆరోగ్య మంత్రి టీఎస్ సింగ్‌దేవ్ మాట్లాడుతూ.. ఈ వైరస్ ప్రాణాంతకం కాదన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు బ్రిటన్, సౌత్ ఆఫ్రికా, బ్రెజిల్ వేరియంట్లకు సంబంధించిన కేసులు నమోదు కాలేదన్నారు. కాగా, కొత్త వేరియంట్ రోగుల్లో ఏ మేరకు ప్రభావం చూపుతుందన్న దానిపై పరిశోధనలు జరుగుతున్నాయి.

  • Loading...

More Telugu News