ICET: తెలంగాణ ఐసెట్ నోటిఫికేషన్ విడుదల

Telangana ICET Notification released

  • జూన్ 7 నుంచి దరఖాస్తుల స్వీకరణ
  • రూ.500 జరిమానాతో జూలై 15 వరకు అవకాశం
  • ఆగస్టు 13 నుంచి హాల్ టికెట్ల జారీ
  • ఆగస్టు 19, 20 తేదీల్లో ఐసెట్
  • సెప్టెంబరు 17న ఫలితాలు

తెలంగాణలో ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశాల కోసం ఐసెట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఐసెట్ కంట్రోలర్ మహేందర్ రెడ్డి నోటిఫికేషన్ ను మీడియాకు విడుదల చేశారు. ఆగస్టు 19, 20 తేదీల్లో ఐసెట్ నిర్వహించనున్నారు. సెప్టెంబరు 17న ఫలితాలు వెల్లడిస్తారు. ఈ నెల 7 నుంచి జూన్ 15 వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు స్వీకరిస్తారు. రూ.250 జరిమానాతో జూన్ 30 వరకు, రూ.500 జరిమానాతో జూలై 15 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. ఆగస్టు 13 నుంచి నిర్దేశిత వెబ్ సైట్ (https://icet.tsche.ac.in) ద్వారా హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చు. తెలంగాణలో ఐసెట్ ను ఈసారి కాకతీయ యూనివర్సిటీ నిర్వహిస్తోంది.

  • Loading...

More Telugu News