Tamilnadu: త‌మిళ‌నాడులో వినూత్న రీతిలో అసెంబ్లీ ఎన్నిక‌ల‌ ప్ర‌చారం!

different way campaign in tamilnadu

  • గుడి వ‌ద్ద  365 మెట్లు ఎక్కిన డీఎంకే కార్య‌క‌ర్త‌లు
  • తిరువళ్లూర్‌ జిల్లా తిరుత్తణి నియోజకవర్గంలో ఘ‌ట‌న‌
  • శివగంగ ప్రాంతంలో రంపంతో స్వతంత్ర అభ్యర్థి ప్ర‌చారం

త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌ల ప్ర‌చారంలో ఓట‌ర్ల‌ను ఆక‌ట్టుకోవ‌డానికి అభ్య‌ర్థులు వినూత్న రీతిలో ప్ర‌చారం కొన‌సాగిస్తున్నారు. తిరువళ్లూర్‌ జిల్లా తిరుత్తణి నియోజకవర్గంలో  డీఎంకే తరఫున పోటీచేస్తున్న చంద్రన్‌ గెలవాలని కోరుతూ ఆ పార్టీ కార్య‌క‌ర్త‌లు దాదాపు 20 మంది సుబ్ర‌హ్మ‌ణ్య ‌స్వామి ఆలయానికి వెళ్లారు. ఈ సంద‌ర్భంగా మోకాళ్లపై 365 మెట్లు ఎక్కారు. మురుగన్‌ తమ కోరిక నెరవేరుస్తారని అంటున్నారు.

మ‌రోవైపు, శివగంగ ప్రాంతంలో ఓ స్వతంత్ర అభ్యర్థి కలైసెల్వం త‌నకు ఈసీ కేటాయించిన గుర్తు గురించి ప్ర‌చారం చేస్తూ  రంపం చేతబట్టుకుని తిరిగారు. ఆయ‌న‌కు ఈసీ రంపం గుర్తు కేటాయించడంతో దాన్నే చేత‌ప‌ట్టుకుని తిరుగుతూ ఓట‌ర్ల‌ను ఆకర్షించే ప్ర‌య‌త్నం చేశారు.

పెద్ద రంపాన్ని భుజంపై ఉంచుకుని ఆయ‌న వీధుల్లో తిరుగుతుండ‌డం ప్ర‌జల దృష్టిని ఆక‌ర్షించింది. తనతో ప్రచారానికి ర‌మ్మంటే మిత్రులు కూడా రావడం లేదని ఆయ‌న చెప్పారు. తాను ఒంటరిగానే ప్రచారం చేసుకుంటున్నాన‌ని తెలిపారు. త‌న‌కు ఈసీ కేటాయించిన రంపం గుర్తును ప్రజలు ఆదరిస్తున్నారని చెప్పారు.

  • Loading...

More Telugu News