Vishnu Vardhan Reddy: ఇప్పటికైనా వైసీపీ సుప్రీంకోర్టుకు వెళ్లకుండా పరిషత్ ఎన్నికలకు కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలి: విష్ణువర్ధన్ రెడ్డి

Vishnuvardhan Reddy comments after High Court stayed Parishat Elections in AP
  • ఏపీలో పరిషత్ ఎన్నికల నిర్వహణపై హైకోర్టు స్టే
  • ఇది బీజేపీ, ఇతర విపక్షాల విజయం అన్న విష్ణు
  •  ప్రజస్వామ్యాన్ని గౌరవించాలని వైసీపీకి హితవు
  • మళ్లీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభించాలని డిమాండ్
ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు బ్రేక్ పడిన సంగతి తెలిసిందే. పరిషత్ ఎన్నికల నిర్వహణపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి ఎస్.విష్ణువర్ధన్ రెడ్డి స్పందించారు. ఇది బీజేపీ, ఇతర విపక్షాల విజయం అని అభివర్ణించారు. ఇప్పటికైనా అధికార వైసీపీ ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలని హితవు పలికారు. సుప్రీంకోర్టుకు వెళ్లకుండా కొత్త నోటిఫికేషన్ విడుదల చేసి ఎన్నికల ప్రక్రియకు నాలుగు వారాల వ్యవధి ఇవ్వాలని సూచించారు. హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనలను గౌరవిస్తూ ఎన్నికల ప్రక్రియ ప్రారంభించాలని స్పష్టం చేశారు.
Vishnu Vardhan Reddy
Parishat Elections
AP High Court
Stay
BJP
YSRCP
Fresh Notification
Andhra Pradesh

More Telugu News