Andy Long: విజయ్ దేవరకొండ 'లైగర్' చిత్రానికి హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్
- విజయ్ దేవరకొండ, అనన్య జంటగా 'లైగర్'
- పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో చిత్రం
- ఆండీ లాంగ్ ఫైట్స్ కంపోజ్ చేస్తాడని చిత్రయూనిట్ వెల్లడి
- గతంలో జాకీచాన్ చిత్రాలకు పనిచేసిన ఆండీ లాంగ్
పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా రూపుదిద్దుకుంటున్న 'లైగర్' చిత్రం కోసం హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ ఆండీ లాంగ్ ఫైట్ సీక్వెన్స్ లకు రూపకల్పన చేయనున్నారు. ఈ విషయాన్ని చిత్రబృందం వెల్లడించింది. ఆండీ లాంగ్ గతంలో జాకీచాన్ చిత్రాలతో పాటు అనేక హాలీవుడ్ చిత్రాల్లో యాక్షన్ ఘట్టాలకు పనిచేశాడు.
కాగా, పూరీ కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న 'లైగర్' చిత్రంలో విజయ్ దేవరకొండ ఓ ఫైటర్ పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఈ యాక్షన్ ఎంటర్టయినర్ లో విజయ్ సరసన బాలీవుడ్ భామ అనన్య పాండే కథానాయిక. రమ్యకృష్ణ ఇందులో విజయ్ తల్లి పాత్రలో నటిస్తున్నారు. 'లైగర్' చిత్రం సెప్టెంబరు 9న విడుదల కానుంది.