Chhattisgarh: కోబ్రా కమాండర్ రాకేశ్వర్ సింగ్ కోసం ముమ్మర గాలింపు.. మావోయిస్టుల చెరలోనే ఉన్నాడని నిర్ధారణ

Police searching operation for cobra commander
  • రెండు రోజుల క్రితం బీజాపూర్‌లో ఎన్‌కౌంటర్
  • ఘటన తర్వాత కనిపించకుండా పోయిన రాకేశ్వర్ సింగ్
  • అటవీ ప్రాంతాన్ని జల్లెడ పట్టిన పోలీసులు
చత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌లో రెండు రోజుల క్రితం జరిగిన భారీ ఎన్‌కౌంటర్ తర్వాత కనిపించకుండా పోయిన కోబ్రా కమాండర్ రాకేశ్వర్ సింగ్ మన్‌హాస్ కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. మావోయిస్టులు చెబుతున్నట్లుగా నిజంగానే అతడు వారి చెరలో ఉన్నాడా? మావోయిస్టులు ఎక్కడ ఉన్నారు? అన్న విషయాలు తెలుసుకునేందుకు పోలీస్ ఇన్ఫార్మర్ల నెట్‌వర్క్‌ను యాక్టివ్ చేశారు. అలాగే, ఎన్‌కౌంటర్ జరిగిన సమీప గ్రామాల్లోని వారిని ప్రశ్నిస్తున్నారు. ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతంలో క్షుణ్ణంగా గాలించినా రాకేశ్వర్ జాడ తెలియలేదని ఐజీ సుందర్‌రాజ్ తెలిపారు. దీంతో అతడు మావోయిస్టుల చెరలోనే ఉండి ఉండొచ్చని పోలీసులు అభిప్రాయపడుతున్నారు.
Chhattisgarh
Bijapur
Encounter
Maoists

More Telugu News