YS Sharmila: భారీ కాన్వాయ్‌తో ఖమ్మం బయలుదేరిన షర్మిల.. అభిమానులకు అభివాదం చేస్తూ సాగుతున్న ప్రయాణం
- ఈ రోజు సాయంత్రం ఖమ్మం జిల్లాలో తొలి బహిరంగ సభ
- పంజాగుట్టలో వైఎస్సార్ విగ్రహానికి షర్మిల నివాళులు
- ఎనిమిది ప్రాంతాల్లో షర్మిలకు అభిమానులు భారీగా స్వాగత ఏర్పాట్లు
- మధ్యాహ్నం సూర్యాపేటలో షర్మిల భోజనం
తెలంగాణలో రాజకీయ పార్టీ పెట్టాలని భావిస్తున్న వైఎస్ షర్మిల ఈ రోజు సాయంత్రం ఖమ్మం జిల్లాలో తన తొలి బహిరంగ సభ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. సంకల్ప సభ పేరుతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి ఆమె హైదరాబాద్, లోటస్ పాండ్‌లోని తన నివాసం నుంచి ఖమ్మంకు భారీ కాన్వాయ్ తో బయలుదేరారు.
మధ్యలో అభిమానులకు అభివాదం చేస్తూ ఆమె సాగుతున్నారు. పంజాగుట్టలో వైఎస్సార్ విగ్రహానికి నివాళులర్పించారు. హైదరాబాద్ ఖమ్మం మధ్య ఎనిమిది ప్రాంతాల్లో షర్మిలకు అభిమానులు భారీగా స్వాగత ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం సూర్యాపేటలో ఆమె భోజనం చేస్తారు.
ఖమ్మం జిల్లా కేంద్రంలోని పెవిలియన్ మైదానంలో ఇప్పటికే ఈ సభ కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. తెలంగాణలో రాజకీయ పార్టీ పెట్టి ఎలా ముందుకు వెళ్తానన్న అంశాలపై ఆమె ఈ రోజు స్పష్టతనిచ్చే అవకాశాలు ఉన్నాయి. పార్టీ పేరుపై ఆమె జూలై 8న ప్రకటన చేసే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.