Direct Taxes: 2020-21లో ప్రత్యక్ష పన్నుల వసూళ్లు రూ.9.45 లక్షల కోట్లు
- బడ్జెట్ అంచనాలకు మించి పన్నుల వసూళ్లు
- రూ.9.05 లక్షల కోట్లు వసూలవుతాయని బడ్జెట్ అంచనా
- అంచనా కంటే 5 శాతం అధికంగా వసూళ్లు
- కరోనా ప్రతికూల పరిస్థితుల్లోనూ వసూళ్ల వృద్ధి
దేశంలో 2020-21 ఆర్థిక సంవత్సరంలో లక్ష్యాన్ని మించి ప్రత్యక్ష పన్నులు వసూలయ్యాయి. 2020-21లో రూ.9.45 లక్షల కోట్ల ప్రత్యక్ష పన్నులు వసూలైనట్టు కేంద్రం వెల్లడించింది. బడ్జెట్ అంచనాల్లో ప్రత్యక్ష పన్నుల వసూళ్లు రూ.9.05 లక్షల కోట్లు ఉంటాయని అంచనా వేయగా, అంతకంటే 5 శాతం ఎక్కువే వసూలయ్యాయి. కరోనా సంక్షోభంలోనూ ఈ మేర వృద్ధి సాధించడం విశేషం అని భావించాలి.
ఇక 2020-21లో పన్నుల వివరాల్లోకెళితే.... రూ.4.57 లక్షల కోట్ల కార్పొరేట్ పన్ను వసూళ్లు వచ్చిపడ్డాయి. వ్యక్తిగత ఆదాయ పన్ను వసూళ్లు రూ.4.71 లక్షల కోట్లు కాగా, సెక్యూరిటీస్ లావాదేవీల పన్ను రూపంలో రూ.16,927 కోట్లు వసూలయ్యాయి.