Tirumala: తిరుమలలో గణనీయంగా తగ్గిపోయిన భక్తుల రద్దీ!

Very Low Rush in Tirumala

  • పడిపోయిన హుండీ ఆదాయం
  • నిన్న 39,085 మందికి దర్శనం
  • హుండీ ద్వారా రూ. 1.75 కోట్ల ఆదాయం

తిరుమల గిరులు ఖాళీ అయ్యాయి. పెరుగుతున్న కరోనా కేసులతో భయాందోళన చెందుతున్న భక్తులు, ముందుగా టికెట్లు బుక్ చేసుకుని కూడా స్వామి దర్శనానికి రావడానికి సంకోచిస్తుండటంతో రద్దీ సాధారణం కన్నా తక్కువగా ఉంది.

నిన్న శుక్రవారం నాడు శ్రీ వెంకటేశ్వరుని 39,085 మంది మాత్రమే దర్శించుకున్నారు. వీరిలో 22,750 మంది తలనీలాలు సమర్పించారు. ఇక హుండీ ఆదాయం కూడా గణనీయంగా పడిపోయింది. నిన్న రూ.1.75 కోట్ల ఆదాయం వచ్చిందని టీటీడీ  అధికారులు వెల్లడించారు. ఇదిలావుండగా, ఈ వారంలో రానున్న ఉగాది పర్వదినం కోసం తిరుమలను ముస్తాబు చేస్తున్నామని అధికారులు పేర్కొన్నారు. 

  • Loading...

More Telugu News