Andhra Pradesh: సెకండ్ వేవ్ ఎఫెక్ట్... కర్నూలు జిల్లాలో ఓ పాఠశాలలో కరోనా కలకలం
- ఏపీలో కరోనా రెండో తాకిడి
- చాగలమర్రిలో కస్తూర్బా పాఠశాలలో 12 మందికి కరోనా
- పాఠశాలలో మొత్తం 246 మంది విద్యార్థినులు
- 80 మందికి కరోనా పరీక్షలు
- కరోనా సోకిన వారికి ఐసోలేషన్
ఏపీలో కరోనా మహమ్మారి మరోసారి జడలు విప్పుకుంది. తాజాగా కర్నూలు జిల్లాలో ఓ పాఠశాలలో కొవిడ్ కలకలం రేగింది. చాగలమర్రిలోని కస్తూర్బా బాలికల విద్యాలయంలోని 12 మంది విద్యార్థినులకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ఈ గురుకుల విద్యాలయంలో 246 మంది విద్యార్థినులు ఉండగా, అనుమానిత లక్షణాలతో బాధపడుతున్న 80 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.
కాగా, కొవిడ్ పాజిటివ్ వచ్చిన విద్యార్థినులను వైద్య అధికారులు ఐసోలేషన్ కు తరలించారు. పాఠశాల సముదాయంలోనే ఓ గదిలో ఉంచి వారికి చికిత్స అందిస్తున్నారు. ఏపీలో విద్యాసంస్థల్లోనూ కరోనా వ్యాప్తి చెందుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ నడుస్తోందన్న అంచనాల నేపథ్యంలో రోజువారీ పాజిటివ్ కేసుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది.