Corona Virus: రూ. 30 నుంచి రూ. 50కి పెరిగిన రైల్వే ప్లాట్ ఫామ్ టికెట్!

Platform Ticket Price Hiked to 50 in Secunderabad
  • కరోనా కేసులు పెరుగుతుండటంతోనే నిర్ణయం
  • ప్రస్తుతానికి సికింద్రాబాద్ స్టేషన్ లో అమలు
  • పెంచిన చార్జీలు మంగళవారం నుంచి అమల్లోకి
కరోనా కేసులు పెరుగుతున్నాయన్న నెపంతో దక్షిణ మధ్య రైల్వే మరోసారి ప్రయాణికులకు షాకిచ్చింది. ప్లాట్ ఫామ్ టికెట్ ధరలను రూ. 30 నుంచి రూ. 50కి పెంచుతున్నామని, రైలెక్కే వారు మినహా మిగతా వారెవరూ స్టేషన్ కు రాకుండా చూసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని దక్షిణ మధ్య రైల్వే మేనేజర్ ఓ ప్రకటనలో వెల్లడించారు.

పెంచిన చార్జీలు మంగళవారం నుంచి అమలులోకి వస్తాయని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతానికి సికింద్రాబాద్ స్టేషన్ కు మాత్రమే ఈ నిర్ణయం వర్తిస్తుందని, మిగిలిన రైల్వే స్టేషన్లకు సంబంధించి ఎటువంటి నిర్ణయాన్నీ ఇంకా తీసుకోలేదని ఆయన అన్నారు.
Corona Virus
Platform Ticket
SCR
Secunderabad

More Telugu News