Deep Siddhu: జైలు నుంచి బయటకు రాకుండానే... మరోమారు దీప్ సిద్ధూ అరెస్ట్!

Punjabi Actor Deep Siddhu Arested another Time
  • శనివారం నాడు దీప్ సిద్దూకు బెయిల్
  • జైలు నుంచి విడుదల కాకముందే అరెస్ట్
  • పురావస్తు శాఖ అధికారుల ఫిర్యాదు
ఈ సంవత్సరం జనవరి 26న ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన హింసాత్మక ఘటనలో అరెస్ట్ అయి జైలుకెళ్లిన పంజాబీ నటుడు దీప్ సిద్ధూ, మరోమారు అరెస్ట్ అయ్యాడు. నిన్న దీప్ కు బెయిల్ మంజూరు కాగా, జైలు నుంచి బయటకు రాకముందే మరోమారు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చారిత్రక సంపద అయిన ఎర్రకోట నాశనానికి ఆయన ప్రయత్నించారంటూ, ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా దాఖలు చేసిన ఫిర్యాదుతో దీప్ సిద్ధూను అరెస్ట్ చేసినట్టు ఢిల్లీ పోలీసు వర్గాలు వెల్లడించాయి.

ఫిబ్రవరి 9న దీప్ సిద్ధూ అరెస్ట్ కాగా, అప్పటి నుంచి ఆయన జైల్లోనే ఉన్నాడు. తన క్లయింట్ నిరపరాధని, పోలీసుల విచారణకు సహకరిస్తారని దీప్ తరఫు న్యాయవాది కోర్టులో వాదించడంతో న్యాయమూర్తి షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేశారు. వ్యక్తిగత పూచీకత్తుకు అదనంగా ఇద్దరితో రూ. 30 వేల చొప్పున జామీనుతో బెయిల్ ఇచ్చారన్న సంగతి తెలిసిందే.
Deep Siddhu
Arrest
Bail
Red Fort
New Delhi

More Telugu News