Sensex: నష్టాల్లో ముగిసిన మార్కెట్లు
- 202 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
- 64 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
- మార్కెట్లపై ప్రభావం చూపుతున్న కరోనా కేసులు
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు తీవ్ర ఒడిదుడుకులకు గురయ్యాయి. ఆ తర్వాత మళ్లీ లాభాల్లోకి వెళ్లినా... ఆ తర్వాత అమ్మకాల వెల్లువెత్తడంతో మళ్లీ నష్టాల్లోకి జారుకున్నాయి. ఈరోజు ఉదయం మార్కెట్లు బలహీనంగానే ప్రారంభమయ్యాయి. దేశంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో పాటు, అంతర్జాతీయంగా బలహీన సంకేతాలు ఉండటంతో ఇన్వెస్టర్లు జాగ్రత్త పడ్డారు. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 202 పాయింట్లు నష్టపోయి 47,878కి పడిపోయింది. నిఫ్టీ 64 పాయింట్లు కోల్పోయి 14,341 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (3.51%), ఎన్టీపీసీ (3.38%), యాక్సిస్ బ్యాంక్ (1.82%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (1.71%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (0.73%).
టాప్ లూజర్స్:
మహీంద్రా అండ్ మహీంద్రా (-2.63%), డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ (-2.30%), టెక్ మహీంద్రా (-1.84%), హిందుస్థాన్ యూనిలీవర్ (-1.78%), భారతి ఎయిర్ టెల్ (-1.70%).